పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

367


మఱియును నమ్మౌని మరణయత్నములు
వెఱవక చేసియు విఫలంబులైనఁ,
దనతపోవనభూమిఁ దడయక చేరి
యనయంబుఁ దపముండ, నటనొక్కనాఁడు,
తనకుమారుఁడుశక్తి తాపసుభార్య
[1]యనఘాంగదృశ్యంతియనియెడు ముగ్ధ
తసయగ్రమునఁబోవ, దానిగర్భమున
వినుత సుస్వర వేదవితతులు చెలఁగ
విని, మౌని యెంతయు వెలఁదిగర్భమున
దనయుఁడుండుటెఱింగి తద్దహర్షించి
పుత్త్రశోకము మాని పొలఁతియుఁ దానుఁ
బౌత్రునిజన్మంబు ప్రార్థించుచుండె.
అంతట నొక్కనాఁ డమ్మౌనికోడ
లెంతయు జలముల కేతెంచుచోట
ఘనకల్మషుండైన కల్మాషపాదుఁ
డెనయ నామునికాంత నేచి మ్రింగంగఁ
జను దేరఁ, [2]జూచదృశ్యంతి తలంక ,
మునుదానినీక్షించి మునివసిష్ఠుండు

కల్మాషపాదుఁడు శాపవిముక్తుఁడగుట


వెఱవకుమని దాని వెఱపెల్ల మాన్చి
మఱవక వానిపై మంత్రోదకంబు
ఝల్లనఁ దనమంత్రశక్తిచే నపుడు
చల్లిన, రాక్షసచపలభావమును
గల్మాషపాదుండు కడముట్ట విడిచి
మేల్మిరాజై ప్రణమిల్లి యాలోన,

  1. అనఘాంగి దృశ్యంతి
  2. జూచి దృశ్యంతి, (మూ)