పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

366

ద్విపద భారతము


పలికె : "నో రాక్షస, పదరక నీవు
బలిమిమైఁ గల్మాషపాదులోఁజొచ్చి,
యావశిష్టాత్మజునణఁగింపు." మనిన
వావిరి నాదైత్యపరుఁడియ్యకొనుచుఁ
గల్మాషపాదులోఁ గడిమి మైఁజొచ్చి
జాల్ముఁ డాశక్తినిఁ జంపి భక్షించె.
మఱియు విశ్వామిత్రుమాయ ప్రేరేపఁ
బఱచి గల్మాషపాదుండు కినిసి,
పొదలు వశిష్ఠునిపుత్త్రుల నెల్ల
వదలక వధియించి వరుసతోఁదినియె.
ఈరీతిఁ దనపుత్రులీల్గినఁ జూచి,
దారుణశోకాగ్నిఁ దాపసోత్తముఁడు
పత్నియుఁ దానును బలవరింపుచును
నూత్నదుఃఖంబుస నొగులంగ లేక
కాళ్లు, చేతులుఁ త్రాటఁగట్టుక పోయి
నీళ్ల నొక్కటను మునింగిన, నదియుఁ
బాంబులన్నియు భగ్నంబు సేసి
పేశలంబుగ ధరఁబెట్టె నమ్మౌని.
నదిమొద లానది యన్ని దిక్కులను
విదిత విపాశనా వెలసె; వెండియును
నొకకొండచఱియలో నుఱుక, నాగిరియు
వికలంబు లేకుండ వెలువలఁబెట్టె;
విడువక యమ్మౌని విపరీతబుద్ధి
దడయక కంఠానఁదగనొక్కగుండు
కట్టుక ఘోరనక్రగ్రాహములకు
బెట్టైననదిఁజొర, బెదరి యన్నదియు
నతిసాత్వికులనంటదలజడన్నట్లు
శతముఖంబులఁ [1] బాఱి[2] శతద్రువయ్యె;

  1. బఱచి
  2. శతధృతియయ్యె (మూ )