పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

365


దక్కక కానలో [1]దశవర్షములును
ఱక్కసుఁడవుగమ్ము రాజ్యంబుమాని."
అనిశాపమిచ్చిన, నధిపుఁడమ్మౌని
బొనర వసిష్ఠుని పుత్రుఁగా నెఱిఁగి,
పురపురఁబొక్కుచుఁ బురమున కేఁగి
గురుకౌశికునకు నాఘోరత చెప్పి
యున్నంత, నొకవిప్రుఁ డుర్వీశుఁగదిసి
సన్నుతి మాంసభోజనమడుగుటయు,
రాజప్పు డడబాల రావించి :"యిట్టి
భోజనంబతనికిఁ భువిఁ బెట్టు" మనుచు
నప్పనచేసిన, నడబాల వోయి
యప్పొద్దు మాంసంబులందక యున్నఁ
గౌశికుమాయచేఁ గార్యంబు మఱచి,
యాశయ్య నరమాంస మనువుగా వండి
ద్విజునకుఁబెట్ట, నాద్విజుఁడురోషించి :
“నిజమింతయును లేక నృపుఁడు నాకిట్లు
మనుజమాంసము పెట్టు మహితపాపమున
మనుజాశనుండు దా మహినౌనుగాక. ”
అనుచు శాపంబిచ్చి యావిప్రుఁడేగ,
నను వేది యానృపుండట్లయ్యె; నపుడు
వింతగా దనుజుఁడై విహరించుచోట
నంతట నొక్కనాఁడడవిలోపలను,
నమితతపశ్శక్తి యాశక్తి వచ్చి
సమిధలు విఱుచుచుఁ జరియింపఁ జూచి
కపటాత్ముడైనట్టి కౌశికమౌని
చపలాత్ము నొక దైత్యుఁ జలమొప్పఁబిలిచి

  1. దశమవర్షములు (మూ)