పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

358

ద్విపద భారతము


తొలఁగకనావృష్టితోచెఁ; తోచుటయుఁ,
జెలఁగి యేతెంచి వశిష్ఠుఁడాలోన
శాంతిహోమాదులు సవరగాఁజేసి
వింత ననావృష్టి వేగంబెమాన్చి,
ప్రజలకు సౌఖ్యంబు పాటిల్లఁజేసి
నిజనివాసమునకు నెమ్మితోనరిగె,
అంత సంవరణధరాధినాథునకుఁ
గాంతితోఁ దపతికిఁ గలితలగ్నమున
నొదవువసిష్ఠాదియోజితకర్ము
డుదయించెఁ గురుఁడన నొకకుమారకుఁడు.
ఆతపతీతనయాన్వయులగుట
బ్రాఁతి మీకబ్బెఁ దాపత్యనామంబు;
కావునఁ గురువంశకర్తలు మీర;
లావశిష్ఠుఁడు మీకు నాచార్యుఁడెపుడు."
అనుచు నాగంధర్వుఁ డంతయుఁ జెప్ప
విని, హర్షమునఁ గ్రీడి వెండియుఁబలికె:
"మా వంశమునకెల్ల మహి గురుండైన
యావశిష్ఠుమహత్త్వమది చెప్పవలయు."

వశిష్ఠునిమహిమ



అనిన దివ్యుఁడువల్కె: "నతని సామర్థ్య
 [1]మనయంబుఁ జెప్పఁగ నలనియె నాకు!
కొంతచెప్పెద విను, క్షోణి నమ్మౌని
యెంతయు ఘనతపోహితమానసుండు;
మున్ను విశ్వామిత్రమునిసేయునెగ్గు
లన్నియుమఱచి, యయ్యమలాత్మునకును
బ్రహమునిత్వంబు పరగంగ నొసగె;
బ్రహ్మసంభవుశక్తి ప్రణుతింపవశమె!”

  1. మనయంగ (మూ)