పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

356

ద్విపద భారతము


పన్నీరుచిలికించి పార్థివుఁగదిసి
క్రన్నన మృగమద కర్పూర భద్ర
మిళిత గంధంబును మేనిండనలఁది,
[1]చలువగా సురటిచే జానొప్పవిసరఁ,
దాపమగ్గలమైన ధారుణీవిభుఁడు
దీపించురవిపుత్రి దేఁజాలినట్టి
తని పురోహితుఁడైస తపసి వసిష్ఠు
ననువొప్పఁదలఁచె నాయతభక్తితోడఁ;
దలఁచిన నాతఁడాధరణీశునెదుర
నిలిచిన, వీక్షించి నీతితోమ్రొక్కి
యాసీనుఁగావించి యంజలిచేసి
భాసురాత్మకుఁబల్కెఁ బ్రార్థన చేసి :
ఆచార్య, మీగృపా[2]యత్తతవలన
భూచక్రమంతయు [3]భోగదేశంబు.
ఒక్కటి నాకింక నొనగూర్చవలయు ;
నక్కార్యమంతయు నాదట వినుఁడు,
వేటఁకైపోయి యేవిపినమధ్యమున
వాటంపుఁగూరిమి వామాయతాక్షి
దపసునికూఁతునిఁ దపతియన్ దానిఁ
జపలతఁజూచితి స్మరుఁడు ప్రేరేప;
అదియును,నామీదనాసక్తినెఱపి
ముదలలేమిని బోయె మొగిఁ దండ్రికడకు;
ఈపొద్దు నీవేఁగి యేరీతినైన
నాపొద్దుఁబ్రార్థించి యతివఁ దేవయ్య."
అనుచుఁ బ్రార్థించిన, నావశిష్ఠుండు
ననుమతి గైకొని యర్కునికడకుఁ

  1. చెలువు
  2. యత్నంబుగాక
  3. భోగకాలంబు (మూ )