పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

355


మదనాస్త్రములవ్రస్సి, మానంబు [1]గ్రొచ్చి,
హృదయమోహమువెంచి, యీలువవంచి,
గండుఁగోయిలకూఁత గర్వంబు వెడలి,
మిండతుమ్మెదజంకెమేనెల్లఁబొదలి,
రాచిల్కపలుకులరవళికిఁ జిక్కి
పూఁచినలతలచేఁ బొంకంబుదక్కి
యుండ, నక్కోమలి యొనరంగవచ్చి
.................................................
తళతళమని మేనితళుకులొప్పంగఁ
బలికె? భూవిభుఁజూచి పరమహర్షమున :
ఓరాజ, నీ కేల యుపతాపమందఁ!
జేరునెందైనను జేరెడు సొమ్ము;
నాతండ్రి సూర్యుండు; నా పేరు తపతి;
నాతలంపున నీవు నరనాథ, కలవు;
ఏ తెఱంగున నైన నీవు మాతండ్రి
నాతతగతి వేఁడు మతఁడు నీకిచ్చు;
తరుణికి నాకు స్వతంత్రత లేదు;
వరుఁడవవశ్యంబు వసుధేశ, నీవు."
అని చెప్పి తపతియు నర్కునికడకుఁ
జనియె; సంవరణుండు స్మరబాధఁబొంది
యున్నంత, మంత్రీంద్రులొయ్యన వచ్చి
యన్నియుఁ దెలిసి యయ్యవనీశువలన,
భూకాంతు నప్పుడు పురవరంబునకుఁ
దోకొనియేతెంచి, తోరంపువేడ్కఁ
జంద్రకాంతపువేది [2]చలువగా నొక్క
సాంద్రపుష్పపుశయ్య సవరగాఁ జేసి

  1. గ్రొస్సి
  2. చలుపగా (మూ)