పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

351


బంధుర రిపు హయ ప్రతిరూపమడఁచు
గంధర్వహయములు గలవు నాయింట;
నిన్నూటి నందులోనిత్తునేవురకుఁ;
జెన్నార నాకీవె! చిచ్చఱకోల. "
అనిన, ధర్మజునాజ్ఞ నాదివ్యబాణ
మనిమిషునకునిచ్చె హరితనూభవుఁడు.
'అవసరంబై నప్పు డశ్వరత్నములు
దివిజ, పుత్తె.' మని తెలియంగఁ జెప్పి,
గాంధర్వమాయయు ఘనముగాఁగాంచి :
“గంధర్వ, యపుడేల గడఁగితి మమ్ము
నీక్షింప మాసత్వ మెఱుఁగలేవైతి;
యక్షులు సర్వజ్ఞులని చెప్పవిందుఁ ;
జెప్పుమా.' యనపుడుఁ జెలఁగి గంధర్వుఁ:
“డప్పటికక్కార్య మట్లయ్యె; విజయ!
ఉగ్రాంశువులులేకయుండుటఁగాదె
[1]నుగ్రాహముగఁ జంద్రుఁజూతురు నరులు;
సూర్యునిఁ దామట్లు [2]చూడరుగాక ;
కార్యమొక్కటిచెప్పఁగలదదివినుము.
హితుఁడు మీకొకపురోహితుఁడు లేకునికి
శ్రుతశౌర్య, యిసుముగాఁ జూతురునరులు.
మంత్రరక్షితమైనమగఁటిమిగాదె!
[3]సంతాపమొనరించు శత్రుకోటికిని.
వ్రతధారులై మీరువర్తించుకతనఁ,
జతురత మీయెడ జయముసిద్ధించె.
కాంతలలో నతికామినై యుంట
నెంతయు మీచేత నిట్లుగావలసె

  1. నుగ్రాసమున
  2. చూతురు
  3. సంతాన