పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

342

ద్విపద భారతము


అవ్వాసవికిఁదక్క నన్యులకేయ
దవ్వైన [1]చరలక్ష్యధనువులువన్ని
సేయుముయత్నంబు; జిష్ణునట్లైన
వేయేల కాంచెదు విపులాధినాథ!'
అనినధైర్యమువచ్చి యతఁడట్లుసేయ
ననిచె మంత్రీంద్రువాక్యప్రకారంబు.
[2]చక్కడింపఁగలేని చాపమూలమున
నుక్కునక్కులుగట్టి యొకచిల్లుచేసి,
యెనయంగఁ దొమ్మిదియినుపసంకెలలఁ
బెనచిననారి నప్పెనువింటఁగట్టి,
[3]యేసులువునరాక యిటునటుఁబఱచు
మోసపుశరములు మొగినైదమర్చి,
కోలలకందక గొనమింటఁదిరుగు
నాలజాలమువోలె యంత్రమత్స్యంబు
పన్నించి : 'యెవ్వఁడే బరఁగ నవ్వింట
నిన్నభోమత్స్యంబు నిలవ్రాలనేసె,
వాఁడు మాకృష్ణకు వర్ణింప మగఁడు;
మూఁడుజాతులకును ముదల యీమాట.'
అనినవార్తకు లోకులందఱుఁ గదలి
చనుచున్నవారు పాంచాలి రాఁగోరి,
బ్రాఁతి రోహిణిఁ బెండ్లి పౌష్యశుద్ధమున;
నాతి, డెబ్బదియేనునాళ్లాదినంబు."
అని విప్రుఁడబలతోనాడువాక్యములు
వినఁ గృష్ణపైఁబుట్టె వేడ్క యేవురకు.
కుంతియు నప్పుడు కొడుకులఁబలికె :
“నెంతకాలంబైన నిందుండఁదగునె!

  1. శర
  2. చక్కుటపసలేదు చాపమూలమున
  3. యేశెలవుల (మూ )