పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

341


హిమకరముఖముతో హేమకలాప
కుముదగంధములతో గూతురొక్కర్తు
జనియింపఁ, దనయు ధృష్టద్యుమ్నుఁడనియు,
ననువొప్ప సుతఁ గృష్ణయనియును బిలిచె.
జనపతి యాగంబుచాలించి యంతఁ,
దననగరికి వచ్చి తనయఁ బెంచుటయు,
జంగారుప్రతిమకుఁ బరిమళంబొదవు
భంగిఁ గృష్ణయుఁ బెండ్లిప్రాయమై యపుడు
నునుజన్నుమోసులు నూగారునారుఁ
గనుదోయిసిగ్గును గలుగుచో, నృపుఁడు
వారణావతమున వహ్నిఁ గౌంతేయ
వీరులీల్గినవార్త విన్నాఁడుగాన :
“నింద్రజునకుఁగూఁతు నీనేరనైతిఁ;
జంద్రాస్యకెవ్వఁడు సరియైనవరుఁడు!
దుర్మదాంధుండగు దుర్యోధనుండు
ధర్మమూర్తుల వారి ధరనుండనీక
పావకశిఖలోనఁ బడఁద్రోచె.' ననుచు
వేవిధంబుల నేడ్వ, వీక్షించి మంత్రి :
'సత్యాత్ములగువారు చావ; రున్నారు;
ప్రత్యక్షమునఁ బక్షి పలుకంగ వింటి.
[1]క్షితినాథ, యేలయేడ్చెదు మోమువావ?
క్షితినున్న వారలు చెడరుపాండవులు;
కాంత వారలసొమ్ముగా బ్రాప్తికలదు;
చింతింపవలదు; సుస్థిరబుద్ధితోడ
నంగనామణికి స్వయంవరోత్సవము
రంగుగా ఘోషింప రమణమైఁ బనుపు.

  1. క్షితినాథ! యేడ్వకుమోమువావ (మూ )