పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

339


అనిద్రుపదుఁడుపోవ, నటయొక్కనాఁడు
ధనకాంక్ష ద్రోణుఁ డాతనిఁగానఁబోయి.
తనలేమిచెప్ప, నాతఁడు గర్వమహిమ
వినక యెగ్గులువల్కి వెడలదొబ్బింప,
నవమానముఁనఁ గ్రోధమారాజుమీఁద
నివురొత్త నాచార్యుఁడిభపురి కేఁగ,
ధృతరాష్ట్రుఁ డాతని ధృతినాదరించి
సుతులకు శరవిద్య చూపఁబెట్టుటయు,
శిష్యుల నతఁడు [1]వీక్షించి : 'వివేకి
దూష్యుని నాకు నాద్రుపదుఁ దెండయ్య.”
అని విద్య చెప్పిన నంతయు నేర్చి
యనికి సన్నద్ధులై యాశిష్యులేఁగి
పాంచాలుఁ దాఁకి యాప్రభుని బాణముల
వంచితులై పాఱ, వారిలో నరుఁడు
దురమునఁ దేరితో ద్రుపదుబంధించి
కురువర్ధనుఁడు దెచ్చి గురునకిచ్చినను,
బాంచాలు నెగ్గులుపలికి ద్రోణుండు
పంచతకడమగాఁ బగదీర్చి విడిచి.
విడిచినఁ గ్రోధాగ్ని విరిసి యారాజు
మృడునకుఁ దపమున్న, మెచ్చి యా వేల్పు
ప్రత్యక్షమగుటయుఁ, బాంచాలుఁడపుడు :
“సత్యాత్మ, నిర్గుణ, శైలేంద్రచాప,
స్మరహర, భూతేశ, జాహ్నవీమకుట,
కఱకంఠ, మాహేశ, కామితఫలద,
అంధకాసురవైరి, యఖలాదిజనక,
సింధుర[2]దమన, యాశ్రితకృపామూర్తి

  1. వీక్షింపవివేక
  2. వరద (మూ)