పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

337


నీచావుచంపుదు నెఱిఁగిపొం" డనిన,
వేచనిరామాటవినుచు రాక్షసులు.
బకుని నెత్తురుటేఱు పాఱినచోట
బకములు నిలువక బంతులుసాగె.
ఆరీతి బకుబారి యాహిడింబారి
యూరికి లేకుండ నుపకృతిచేసి,
బరువైనయాకళేబర మీడ్చి తెచ్చి
[1]పఱగటవైచిన, బ్రాహ్మణోత్తములు
ననిలసంభవుని బాహాధురంధరునిఁ
గనుఁగొనవచ్చిరి కట్టలుగట్టి.
సురపురీసురుల భూసురుల దీవనలు
కరువలిపట్టికిఁ గలిగె [2]వేవేలు.
వేవిధంబుల నిట్లు విప్రప్రతిష్ఠ
గావించి వేడ్కతో గౌంతేయులుండ,
నత్తఱి నొకవిప్రుఁ డాగృహంబునకు
హత్తినరతిఁ దీర్థయాత్రకై వచ్చి,
గృహపతిఁగాంచి యాగృహమేధిచేత
బహుభంగిఁ బూజలువడయ, నారాత్రి
కొడుకులువినుచుండఁ గొంతి యావిప్రు
నడిగెనిట్లని చేరి యతివినయమున :
"ఏ దేశమున వార? లెందుఁ బోయెదరు?
భూదేవ, యేభూమిభుజుఁడు ధార్మికుఁడు?
అతిథులఁబూజింప నాత్మలోఁగోరు
హితులు పుణ్యగృహస్థు లేసీమఁగలరు?
తలఁప నేమైన వార్తావిశేషములు
గలవె! మీరెఱుఁగనికటకంబు లేదు

  1. పరకటు
  2. దీవనలు (మూ )