పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

336

ద్విపద భారతము


మనుజులపునుకలు, మఱి [1]రిత్తబండ్లు,
నెనుఁపయట్టలు నిండా నేటిచాడ్పునను;
అన్నియుఁగ్రక్కింతు." నని వాని నెగసి
తన్నిన, వాఁడు నుధ్ధతి భీమునురము
వదలకపొడిచిన, వారిరువురకు
గదనంబు లోకభీకరముగా నయ్యె;
ఉరుముష్టిహతి మ్రోఁత యుబ్బుటగాని,
కరములరాకపోకలు గానరావు;
పడుట లేచుట కానఁబడుఁ గొంతగాని,
వడముడి బకుఁడన వరుస నేర్పడరు;
విదలింప నదలింప వ్రేటును వాటుఁ
బొదివి నొక్కును ద్రొక్కుఁ బోటును మాటు
నొడుపును విడుపు నొండొరుత్రోపు దాపుఁ
దొడికిపట్టును బిట్టుఁ దోరమై నిగుడ
నంధకాసురునకు హరునకుఁబోలె
బంధురసమరంబు బకపాండవులకు
నడచుచో, నలిగి మారుతపట్టి వానిఁ
బడద్రొక్కి, యంతనేర్పడ నిరుఁగేలఁ
గటుకున నటవచ్చి కట్టియవిఱుచు
పటులీల విఱిచె నాపాపాత్మురొమ్ము.
అప్పుడు బకుఁడు మహాధ్వనిసేయఁ
జప్పుడువిని వచ్చి సకలరాక్షసులు
వినువీథినిలిచిన, వీక్షించి భీముఁ
డనియె: "రాక్షసులార, యందఱువినుఁడు;
ఏకచక్రమునకు నెవ్వఁడే నెగ్గు
గైకొనిచేయు నాకపటరాక్షసుని

  1. రుత్తపండ్లు (మూ )