పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

329


ఏకచక్ర పురావాసము



లాటరాజ్యంబున లలి బ్రహ్మలోక
చాటువుగల యేకచక్రంబు గాంచి,
యనుపమకీర్తు లయ్యగ్రహారంబు
ఘనవిప్రవేషంబు గైకొని చొచ్చి.
విడిదలగా నొక్కవిప్రునియింట
విడిసి వేదంబులు వేడ్కఁజదువుచు,
నేగురుభిక్షార్థమేఁగి నిత్యంబు
నోగిరంబులు దేర, నువిద భాగించి
సగముభీమునిచ్చి సరినున్న సగము
ప్రేమ నేవురుఁ దృప్తి బెరయఁ గుడుచుచును
నుండుచో, రవితోడ నుల్లసంబాడు
పాండవతేజంబు పరికించి ద్విజులు:
"ఐదుమోముల శివుండైదు [1]వేషంబు
లాదటగతిఁ దాల్చి యరుదెంచినాఁడొ!
పరహితోన్నతినొప్పు పంచభూతములు
ధర నిట్టితనువులు దాల్చియున్నవియొ !
ఈ తేజములు వీరికెక్కడఁ గలిగె
ధాతనూతనసృష్టి తలఁప [2]నేవురును!"
అనునంత, నొకనాడు హాహారవంబు
విననయ్యెఁ దారున్న విప్రునియింట
అదివిని, గొంతియు ననిలనందనుఁడు
సదయులై కదిసి విచారింపుచుండ,
నాలోన మూర్ఛిల్లి యల్లనఁదెలిసి
యాలి బిడ్డలఁ జూచి యాయింటిద్విజుఁడు :

  1. వేదంబు
  2. రెవ్వరును (మూ)