పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

ద్విపద భారతము


మనుజేంద్రులున్నచో, మారుతి యంత
దనుజకామినితోడ దర్పకకేళి
వెసఁ బుష్పకముఁగన్న వేల్పును బోలెఁ
బొసఁగ నానామార్గములఁజరింపుచును,
నేరూప మేప్రాయ మిచ్చకువచ్చి
నారూప మాప్రాయ మతివఁగమ్మనుచు
విహరింప, నుదయించె వెస ఘటోత్కచుడు;
సహజశస్త్రాస్త్రుండు, శంఖకర్ణుండు,
శ్యామలతనుఁడు దంష్ట్రాకరాళుండు,
భీమవిక్రముఁడు, గంభీరభాషణుఁడు,
రాక్షసయుతుఁడు సంప్రాప్తయౌవనుఁడు,
వీక్షింప సురలకు వ్రేగైనవాఁడు.
దనుజుఁడాగతిఁబుట్టి తల్లికిమ్రొక్కి,
మనుజేశులకు మ్రొక్కి మౌళిఁగేల్మొగిచి  :
“పనిగలయప్పుడు భవ్యాత్ములార,
ననుదలంపుడు వత్తు నాసేనఁగూడి;
వచ్చి, సంకటములు వడి నెన్నియైన
బుచ్చివైచెద మీరు బుద్ధిలో మెచ్చ. "
నని చెప్పి, వారిచే ననుమతి వడసి
చనియె నుత్తరముగా జననిదోడ్కొనుచు.
ఆలోనఁ బాండవు లట్లు శాస్త్రములు
శాలిహోత్రునియొద్దఁ జదివి చాలించి,
యతనిచేఁ బూజితులై మ్రొక్కి కదలి,
చతురత మత్స్యరాజ్యములోన నడచి,
యంతఁ [1]త్రిగర్తరాజ్యములోన వెడలి,
యంతఁ గీచకవిషయంబులు దాటి,

  1. త్రిగతర్క (మూ)