పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

326

ద్విపద భారతము


ననిలజుఁ డమ్మాట కంగీకరించి
దనుజకామినిఁజూచి తగగుస్తరించి:
“యోజతో దినమెల్ల నొకచోటఁబుచ్చి
రాజీవముఖి, రమ్ము రాత్రినాకడకుఁ ;
గొడుకుగల్గినదాఁక గొమ్మ, యీరీతి
నెడతాఁకి, వీడ్కొను మెఱిఁగియవ్వెనుక. ”
అనియెడఁబడఁజెప్పి యందఱుఁగూడి
చనుదేర, వేదఘోషంబులతోడ
వేడుకఁ బులినాకి విడిచిన లేడి
దూడలచేఁ బడ్డ దొరువులచేత,
హరిదువ్వ నిద్రించు హస్తులచేతఁ,
బరమాత్ము జింతించు బకములచేత,
ఘనబిడాలములకుఁ గందమూలములు
గొనితెచ్చు మూషికకులములచేత,
నహులకు యోగనిద్రాసక్తి నుండ
బహుబిలములు చూపు బభ్రులచేత,
వాసిత మాసోపవాస వరాహ
కాసర శరభ ఖడ్గంబులచేత,
శాఖలగతి వేదశాఖలు[1]గలుగు
శాఖులచే నతిసౌమ్యంబ యగుచు
ననుపమ శాలిహోత్రాశ్రమంబున్నఁ
గనుఁగొని మ్రొక్కి భాస్కరునుదయమున
నిత్యసంధ్యావిధుల్ నృపు లందుఁదీర్చి,
దైత్యకామినిమాట తథ్యమౌననుచు
నున్నయప్పుడు వ్యాసుఁ డురుకృపావాసుఁ
డున్నతాజినవాసుఁ డొయ్యనవచ్చి,
.................................................
హరినాత్మనునిచిన యానిమిత్తమున
.................................................

  1. గలిగి – నాఖంబుల చేత నతిరమ్యమగుచు (మూ )