పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

325


"కులముతోఁ బగగొని కుసుమాస్త్రబాణ
దళితనై వచ్చితిఁ దనుబొందుమనుచు;
కపటమెఱుంగ; రాక్షసినైన నేమి!
విపరీతమునఁ దన్ను విడిచినఁ జిత్తు.
చెప్పఁగదే! భీమసేనున కెఱుఁగ
నిప్పుడు ననుడించి యేఁగుట తగదు.
[1]తగ నతీతానాగతము లెఱుంగుదును;
బగతుచే మీరుత్రోపడివచ్చినారు;
ఇద్దెస మీకింక నేగుచో నెదుటఁ
దద్దయు విశ్రాంతి తరువులు [2]కూర్పఁ
గన్నులపండువై కడుసమీపమున
నున్నది విను శాలిహోత్రునాశ్రమము.
అచ్చట కేగి మీరర్థినున్నంత
వచ్చు వేదవ్యాస వరమునీశ్వరుఁడు.
ఆతఁడు బుద్ధి మీకానతియిచ్చు;
నాతి, వెండియు విను నావిశేషములు.
గోరినయెడలకుఁ గొనిపోదు మిమ్ము;
వారకతెత్తు మీవాంఛితార్థములు;
ఏ రూపుగమ్మన్న నేను గానేర్తు;
నూరక తానేల నొల్లఁడె!"ట్లనినఁ
గుంతిసంతోషించి, కొడుకుతో దాని
మంతనంబెఱిఁగించి మఱియుఁ బ్రార్థించి :
"రా భీమ, దానవురాలి విరాలి
లాభించు మనకు నేలా దిగవిడువ.
'చేపట్టుశరణ' ని చేరినవారి
నేపట్టునను గాచు టిదిధర్మ" మనిన

  1. తగనతితానాగమతతు...
  2. మాన్ప (మూ)