పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము


మానుషగంధంబు [1]మఱివల్చుటయును,
లేనవ్వుతో నావులించుచు లేచి,
తనచెలియలిఁజూచి దర్పించిపలికె:
"వినుమ హిడింబి, దైవికమున నేఁడు
మనుజులువచ్చిరి మనవనంబునకుఁ;
జని, వారిఁజంపి, మాంసము తెచ్చి నీవు
దీనపుమృగములఁదినినయావెగటు
మాన, నేర్పునవండుమా చవిపుట్ట.
దేవదానవులునుదృష్టింపరాని
యీవనస్థలియేడ! యీమర్త్యులేడ!

హిడింబ భీముని మోహించుట



పొ." మ్మనుటయు, నదిపోయి హిడింబి
యమ్మారుతాత్మజు నాననప్రభయుఁ
గన్నులసొబగు, విశాల[2]వక్షమును,
నున్నతఘనభుజాయుగమును జూచి,
పులకించి పంచాస్త్రభూతంబుసోఁకి,
తలంపునఁ దమకించి తనమేనుమఱచి,
కామరూపిణిగానఁ గడునొప్పుమనుజ
కామినియై, భీముఁగదియనేతెంచి:
"యనఘ, యేను హిడింబుఁడనురాక్షనునకు
ననుజ; హిడింబనియండ్రునాపేరు;
కామరూపిణి; నేమిగమ్మన్న నగుదు;
నీమూర్తివసఁజొక్కి, నిన్నుఁగామించి
వచ్చితి; నిమ్మహావనములో మీరు
చొచ్చివర్తించుట చోద్యంబు దలఁప!

  1. మాఱు
  2. వక్షతయు (మూ )