పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

ద్విపద భారతము


బడబాగ్ని భాస్కరప్రభకోర్వలేక
వెడలె వార్థిననంగ వెససంజదోచె;
కమలయుండఁగ రాత్రి గండుతుమ్మెదలు
కమలంబులో నుండఁగాదని చెలులు
చోపిన నవియెల్లచో నుండెననఁగఁ
గాపురం బేతెంచెఁ గడలఁజీఁకట్లు;
రాజైనచంద్రుండు రానున్నతోవఁ
[1]బూజార్థమైన కర్పూరంపుమ్రుగ్గు
బెరయ దిశాకాంత పెట్టెనోయనఁగఁ
గరమొప్పెఁ జుక్కలు గగనభాగమున;
మహి ధార్తరాష్ట్రులు మనవారలనియు,
సహజనామంబుల శకునులమనియు,
[2]శిక్షించునో భీమసేనుడన్నట్లు
పక్షు లూరకయుండెఁ బలుకులుమాని;
మొగి నీలి[3] చీరపై ముత్యాలువోలె
గగనంబుపైఁ దారకంబులు వొడమెఁ;
దనమనుమలకైన తాపంబు మాన్ప
నెనసినవేడ్కఁ దా నేతెంచెననఁగ,
ధవళంపు వెన్నెల దట్టమై పర్వ
ధవళాంశుఁ డుదయించె దండి తూర్పునను.
అత్తఱి, నచ్చటికనతిదూరమున
నుత్తుంగగృహమున నొక్కరాక్షసుఁడు
నిరులుగ్రమ్మెడు మేను, నెఱసంౙగ్రుడ్లు,
నెఱిగొంకిగోళ్లును, నిడుపైనకాళ్లు,
నందమౌనొక బ్రహ్మహత్యయువోలె
డిందనిబిరుదు హిడింబుఁడన్వాడు

  1. భూజాతమైన
  2. శిక్షింపుచో
  3. చిరము (మూ)