పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

317


[1] జెదరక శాఖలన్ జేచాచి మింటి
యుదరంబుత్రోచిన యొక మఱ్ఱి గాంచి,
యభవునకిల్లైన యామ్రాని మొదల
విభునిఁ దమ్ములఁ దల్లి వెరవొప్పనునిచి,
“యుదకంబులెక్కడనుండునో! ' యనుచుఁ
దుదికొమ్మ వాయుపుత్రుడు ప్రాఁకి చూడఁ,
గాక బక గ్రౌంచ కారండ [2]కమఠ
కోక బలాకాదికూజితంబులను,
వారిహారి మదాంధ వనగజ గంధ
పారణావారణ భ్రమర భాషలను
గాననయ్యెను నొక్కకమలాకరంబు
పూని విష్ణుఁడువోలె భువనభారమున.
వాయునందనుఁ డంత వసుధకుడిగ్గి,
యాయతగతి నేఁగి యమ్మడుఁగుఁజొచ్చి,
మొదలఁ గుత్తుకబంటి మొలబంటిగాఁగ
నుదకంబుద్రావి యాయువు నిల్వనమ్మి,
డొక్కలవలె నాకుడొప్పలు కుట్టి
యొక్కతోయము తోయ మొగినందునునిచి
గొనితెచ్చునంతకుఁ, గుంతియు సుతులుఁ
దనువులు మఱచి నిద్రలువోవ నతఁడు
నుదకంబుడించి వారున్నజాడకును
మదిలోని శోకంబుమల్లడిగొనగ
నుండుచోఁ, గర్ణుని యుద్దండగతికి
మండునోనామీఁద మారుతియనుచు
శంకించుగతిఁ గ్రుంకె జలజబాంధవుఁడు;
హుంకరింపుచు గూబ లుఱుములు చూపె,

  1. జెదరకబారలచేచాచికంట
  2. కుదర (మూ )