పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

312

ద్విపద భారతము


విను మిదియునుగాక, విదురుండు మనల
'ననలవిషాస్త్రంబులరయుఁడి' యనియె."
అనినభీముఁడుపల్కు: “నట్లైన వీని
నెనయఁ దాఁగట్టినయింటితో గాల్చి,
కురురాజయత్నంబు కుడిపింత.' మనిన
ధరణీశుఁ:"డదిగాదు; తమకింపరాదు;
ఏమఱకుండుటే యిదినీతి; గాని,
భీమ, యీనీచుఁజంపఁగ నేమిగలదు!
కొన చిదుమఁగనేల! కురురాజు[1] తలఁపు
కనుఁగొంద; మెన్ని మార్గముల రాగలఁడొ!
మనము [2]మున్పడఁ, దప్పుమనమీఁద వైచి
మనుజేశునకు వాఁడు మంచివాఁడగును;
హత్తినకర్మాబ్ధి యతివోలె నిందుఁ
జొత్త; మింతేకాని సుఖకాంక్షవలదు."

విదురుఁడు పాండవులయొద్దకు దూతనంపుట



అని లక్కయింటికి నలవోకఁజనుచు
మనముల వారినమ్మనివారుగానఁ
బగళులవేఁటాడి పరఁగ రాత్రులను
మగఁటిమి విలుగోల మఱువకయుండ,
ముప్పదుల్ మూఁడును మూడుముప్పదులు
నప్పురి దివసంబులరిగె వారలకు.
అత్తఱి, విదురాజ్ఞ నాపురంబునకు
సొత్తినపరువుతో నొకదూతవచ్చి,
యేకాంతమున వారినేవురఁ గాంచి :
"యోకాంతినిధులార, యొక వార్త వినుఁడు,

  1. తనకు
  2. మున్పిన (మూ)