పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

310

ద్విపద భారతము


వరుస ధర్మజ భీమ వాసవి యములు
కరిపురిఁజొచ్చి యక్కరిపురిలోనఁ
గౌరవులును దాముఁగలిసివర్తింప,
వారక పదుమూఁడువర్షంబులయ్యె.
అవిగూడ నవిగూడ నైనప్రాయముల
భువి వారణావతపురిఁ జేరఁబోయి,
పురముశృంగారంబుఁ బురవిభవంబుఁ
బురపురంధ్రులుచల్లు పుష్పాక్షతములు
మెచ్చుచువచ్చుచో, మేదినీశ్వరుల
నిచ్చఁబొంగుచుఁ బౌరులీక్షించి యవుడు :
"దేవమూర్తుల [1] వీరిదృష్టింపఁ గలిగెఁ ;
బావనత్వముఁబొందె భవములు మనకుఁ ;
బట్టణంబిదిగాఁగఁ బాండునందనుల
నెట్టనరప్పించె నృపులఁగానోఁచి ;
తొడఁగి దుర్యోధనుదుర్మంత్రమునకుఁ
గడచివచ్చిరి దివ్యకాయులువీరు.”
అనికొనియాడ నొయ్యన రాజవీధిఁ
జనిచని నిజరాజసౌధంబుగదిసి,
గనకరథంబులు ఘనులంతడిగ్గి,
వెనుకవచ్చిన సేన విడియ వీడ్కొలిపి,
పుణ్యాహవాచనపూర్వంబుగాఁగఁ
బుణ్యుల విప్రోత్తములఁ బూజచేసి,
మంగళాలంకారమహితంబులైన
బంగారుగృహములఁ బరిపాటివిడిసి,
కడునొప్పు కరిపురీకనక సౌధములు
విడిచివచ్చినవంత విడిచిరి కొంత.
అంతఁ బురోచనుఁ డాజతుశ్శాల
యెంతయునేర్పుతోనీడేర్చివచ్చి,

  1. వారి. (మూ)