పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

ద్విపద భారతము


మదియు నాయుధశాల కపరభాగమును
మృదుచతురస్రమై మెచ్చుగా వలయు,
ఆవాసమునఁగాని యచట వేఱొక్క
యావాసమునఁ బార్థులమరంగఁజొచ్చి
యొంటిమై నిద్రింప, నొకనాఁటిరాత్రి
మంటలుదగిలించి మడియింపు వారి.
ఇంతచేసిన, నాకునేకభోగముగఁ
జింతింప రాజ్యమిచ్చిన వాఁడవగుదు."
వనిన నింద్రార్ధమై హరునిఁగలంప
బనిఁబూని చను పంచబాణుండువోలె
వాఁడేగి, వారణావతమున మున్న
పోఁడిగాఁ గర్పూరమును సజ్జరసము
లక్క మైనంబుఁ దైలముఁ దట్టుఁ బునుఁగుఁ
దక్కోలమును హరిదళము నాజ్యంబు
గుగ్గులుధూళియుఁ గ్రొత్తకస్తూరి
యొగ్గైనమంటితో నొయ్యనఁగలిపి,
మెదిపి గోడలుపెట్టి మిద్దెయిల్ పన్ని,
మృదువుగా సున్నపుమెయిపూఁత పూసి,
తెల్లంబుగా మృత్యు దేవతవంట
యిల్లొ! [1]పావకునకు నిడిన నంజుండొ!
యన నస్త్రశాలకు నపరభాగమునఁ
బనివడి వాఁడట్లు పన్నుచునుండె.
అట పాండవులు రమ్యమైన లగ్నమున
బటుతర చతురంగబలములు గొలువఁ,
గుంతిఁదోడ్కొని బంధుకోటులనిలిపి,
యంతట దుర్యోధనాదులననిపి,

  1. పావకునకునిదియు జుంగరియొ (మూ)