పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

307


పాండవుల వారణావతగమనము


బ్రియపూర్వకంబుగాఁ బిలిచి యిట్లనియె:
"నయనిధులార, యోనందనులార,
యొండు ఠావుల మిమ్ము నునిచెద; నందుఁ
బొండు కుంతియు మీరు బుద్ధినొండనక.
గంగానదీ తుంగకల్లోల సుభగ
సంగతి నీశ్వరస్థానమైయున్న
వారణావతపుర వరము చేకొనుఁడు;
వైరులువచ్చుత్రోవకు నడ్డ [1]మగుఁడు;
మఱి యుత్సవముల బ్రాహ్మణ భోజనములఁ
గఱకంఠుఁ బూజింపఁగలుగు మీకచట."
అనవుడు ధర్మరాజవుఁగాక యనుచు
వినయంబుతోడ నవ్విభునకు మ్రొక్కి,
గాంధారిపాదపంకజముల కెఱగి
బాంధవులకుఁ జెప్పి పయనమౌనంతఁ,
బోయెదరని యాత్మఁబొంగియు వారి
నాయూరఁదెగటార్ప ననువుచింతించి,
యదయుఁ బురోచనుండనుశిల్పకారు
ముద మొప్పఁబిలిపించి మొదలికౌరవుఁడు
రౌద్ర దారిద్య్ర నిద్రా ముద్రనణఁచు
భద్ర కాంచనమిచ్చి, పసిఁడి తేరిచ్చి:
"రుచివిరోచన, యోపురోచన, నిన్ను
సుచితకార్యమున నియోగింపవలసె;
వారణావతమున వసియింపగోరి,
వారె పాండవు లటవచ్చుచున్నారు;
పొందుగా మున్నాడిపోయి వేవేగ
నందు లాక్షాగృహమాయిత్తపఱుపు;

  1. మనుచు (మూ)