పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

ద్విపద భారతము


సహజప్రతాపుఁడజాతశత్రుండు
మహినింతవాఁడైన మనకేమిగలదు!
వలదని నృపునకు వారింపరాదు;
కలదె! యింకనుబాయఁ గక్ష నా." కనుచు
ఘననీతిగణ్యుని గణికుఁడన్వాని
దనమంత్రి గాంధారితనయుఁడీక్షింప,
నింగితంబామంత్రి యెఱిఁగి కుమార
పుంగవునకు నిట్లు బుద్ధియేర్పఱచె :

గణికునుపదేశము



" ఓనాథ, వినుము దండోపాయనియతిఁ
గాని భూప్రజ రాజుఁగైకొనరెపుడు;
తగిన [1]దండముచాలు ధాత్రికి నైన;
దగనిదండము చెల్లుఁ దనవారిచోటఁ;
దనవారివలెనుండి దాయలై చంపు
జనుల శోధింపని జననాథుఁడేల!
తన కెవ్వ రెంతమంతనము చెప్పినను,
దనబుద్ధిలోఁగాని తానుండవలదు;
ప్రజలు మూఁకలుగట్టి బహుభాషలాడ
నిజము నిక్కము సేయ నృపునకుఁగాదు;
తనయూన మొకనితోఁ దలపోయవలదు;
.................................................
అరులు వచ్చినదాఁక నరులకుఁదాను
.................................................
పనివడి ప్రియములు పాటింపవలయు;
దార కుమార సోదరులాదిగాఁగ
వారువీరనక యెవ్వరినమ్మవలదు;

  1. చందము (మూ)