పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

301


బాఱవాతిశరమ్ము పవనజునురము
దూఱ నొక్కటినాటి, ద్రుపదుఁడందంద
సేనాసమేతుఁడై చెదరక యింద్ర
సూనుపై శరములుచొనుపుచో, నతఁడు :
“నెఱిఁగితిఁ, గర్ణాదులితనికిఁగాక
[1]విఱుగుటకగు; వీఁడువేఁడివిల్కాడు.
వాలాయ మింతటివాడుగాకున్న,
నేలరమ్మను ద్రోణుఁ డితనినిఁబట్ట
మేనువంచింపక మేకొనిపెనఁగి
యేనుబట్టుకపోదు నిలఁగీర్తి గలుగ.”
అని దివ్యబాణంబులరిఁబోయ, నంత
ధనువు తున్కలుచేసె, తగ ద్రుపదుండు
మెఱుఁగునారసముల మేననెత్తురులు
వఱదలై పాఱ నావానవినొంచి,
కవల మీఁదఁ బ్రచండకాండంబులేయఁ,
దవిలి వేఱొకవిల్లుదాల్చి యర్జునుఁడు
నెఱి పిడుగులువోలె నిగుడి వక్షంబు
గఱవఁ బుంఖానుపుంఖములు బాణములు
పఱపుచో, నెడచొచ్చి పాంచాలుతమ్ము
డఱిముఱి సత్యజిత్తనియెడువాడు
నరునితోఁదలపడి నానాస్త్రవృష్టి
గురియ, భీముఁడు వానికొనరెట్టవట్టి
పాఱవైచినఁబోయె; బలమంతవచ్చి
దూఱంగ, నంతలో ద్రుపదభూవిభుఁడు
కోపించి భీముని గోత్రారిసుతునిఁ
జూపుడింపక వజ్రసూటిబాణములఁ

  1. విఱిగినతగు (మూ)