పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

295


బట్టభద్రుని జేసి, పరఁగ నాతనికి
బట్టాంశుకంబులుఁ బసిఁడి[1]యుత్తరిగ
లురుహారములు రాజయోగ్యపీఠములు
హరులు మత్తేభంబు లాతపత్రంబు
లిచ్చిన, రాధేయుఁడిచ్చనుప్పొంగి :
"మెచ్చితి రాజేంద్ర, మేలునీ ప్రియము;
ఏమైననడుగు నీకి చ్చెద" ననిన
నామహీపతిపల్కు నందఱువినఁగ :
"ఈశ్వరుతోడ యక్షేశుండువోలె
వైశ్వానరునితోడ వాయువువోలె
జంద్రునితోఁ బుష్పచాపుఁడువోలె
నింద్రునితోడ నుపేంద్రుండువోలె
నాతోడ మైత్రి యున్నతిఁజేయు." మనిన
నాతం డచ్చోటికి నగ్నిదెప్పించి,
యావేల్పుసాక్షిగా నతనితో మైత్రి
గావించెఁ బాండవకౌరవు లెఱుఁగ.
సూతుఁడప్పుడు తనసుతుఁడుకర్ణుండు
బ్రాంతిగా నంగాధిపతియైనవార్త
విని వచ్చి గరిడిప్రవేశించుటయును,
వినుతి నారాచంబువిడువంగ రాక
ధృతి[2]సూతగోత్ర రాధేయనామములు
పతులెల్లవిన నంగపతి చెప్పుకొనుచు,
నయ్యకుమ్రొక్కి [3]లజ్జానతవదనుఁ
డయ్యున్నఁ, జూచియిట్లనియె భీముండు :
"కాకి కోయిలయని గారాము చేయు
నేకాలముననైన నెఱుఁగరాకున్నె!

  1. యుత్తెరలు
  2. సూత్ర
  3. లజ్జాయత (మూ)