పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

ద్విపద భారతము


నెడచొచ్చి గురుఁడు [1] దేవేంద్రజుశరము
లుడిపి, కర్ణునిఁజూచి యుగ్రుఁడై పలికె:
'ఆచార్యులముగాన, నాజిధర్మములు
వేచూపి తలపడవిడుతుము నిన్ను;
తక్కువవానితోద్వంద్వయుద్ధంబు
స్రుక్కక సేయనిచ్చుట దోష; మధికుఁ
డీనృపాలకుఁడర్హుఁ, డిందువంశ్యుండు,
సూనుండు పాండురాజునకుఁ గుంతికిని;
నెఱయ నీగోత్రంబు, నీతల్లిఁదండ్రి
నెఱిఁగింపు; [2]దొరవైన నితఁడుపోరెడిని.
ఎచ్చట నస్త్రంబు లెవ్వానిమొఱఁగి
తెచ్చినాఁడవొ! నిన్నుఁదెలియరా." దనినఁ,
దనకుసహాయమై దైవంబుదెచ్చె
ననుచు దుర్యోధనుండచ్చోటుగదలి :
ఆచార్య, నీకునిట్లడుగంగఁదగునె!
మీచందమొప్పదు; మెచ్చితివీనిఁ;
గులమడుగఁగనేల! కూతునిచ్చెదరొ!
వలనైనవిద్య యెవ్వనిపాలఁబోయె!
కులజుఁడే పెనువ్రేలుగోసిన యెఱుకు!
తలఁపరు పక్షపాతమున నాడెదరు;
రాజుగాఁడనిగదా! రణముమాన్చితిరి;
రాజుఁజేసెదఁ గర్ణు రాజులుమెచ్చ.
అని వేదపారగులైన బ్రాహ్మణుల
ఘనుఁడు సహస్రసంఖ్యలఁబిలిపించి,
కనకసంపన్నులఁగాఁజేసి, వారి
యనుమతితోఁ గర్ణు నంగభూమికిని

  1. దేవేంద్రుని
  2. దొరసిన (మూ )