పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

ద్విపద భారతము


చపలచిత్తమువోలెఁ జంచలంబైన
కపటకాకముతల ఖండించుటయును,
వాసవిఁబొగడ, నశ్వత్థామమొగము
వీసమంతై తోచె విలుకాండ్రుచూడ.
తోరంపుసిగ్గుతో దుర్యోధనుండు
భూరిరాత్రుల నిద్రఁబొరయక యుండె.
శరగురుం డెంతయు సంతోషమంది;
"సరిలేరు వింటికి జగమందునీకు;
నచలితదృష్టియు, నలవును, వెరవు
నుచితంబులై నీకునొగిఁ జెల్లు;ననుచు
నాచార్యుఁడర్జును హస్తకౌశలము
చూచి వేడుకనిచ్చె సునిశితాస్త్రములు.
తక్కినవారికిఁ దగినచందములఁ
గ్రక్కున విలువిద్య గఱపియున్నంత,
ధృతరాష్ట్ర గాంగేయ కృప సోమదత్తు
లతిమోదమొందంగ నక్కుమారకులు
శరగురుచేఁగన్న శస్త్రాస్త్రవిద్య
కరమద్భుతంబుగాఁ గడిమిఁజూపుటయు,
రాజశేఖరులెల్ల రమణమైఁదన్నుఁ
బూజింప నెంతయుఁబూజ్యుఁడై, గురుఁడు
వెండియు నొకనాఁడు విపులదోర్దండ
చండిమ చూతముసరసిలోననుచు
మకరంబులుండుమడుఁగున కేగి,
సకలశిష్యులుచూడ జలముచొచ్చుటయు,
నొకమహాగ్రాహంబు ఒడిసి పెందొడను
బ్రకటితదంష్ట్రలఁ [1]బట్టి, యాపట్టు

  1. బట్టెబట్టుటయు (మూ )