పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

ద్విపద భారతము


గురుపూజ నా చేతఁగొందుగా," కనిన
గురుఁడింద్రజుఁడు మెచ్చుగుఱి వానికనియె:
"వనచరనాథ, నీవలచేతిలోని
పెనువ్రేలునాకిమ్ము ప్రియమార." ననిన,
నతఁడును : "నదియె మహాప్రసాదంబు
హితమతిఁ గై కొమ్మ యిచ్చెద." ననుచు
ననువుమీఱఁగ నలుఁగమ్మున వ్రేలు
దునియంగనొత్తి యాద్రోణునకిచ్చె.
అదికతంబుగఁ బోయె నధికుడైనరుఁడు
ముదమంది మదిఁగల [1]ముసురెల్లవిడిచి.
అతివేడ్క గురుడును నతనిఁదోడ్కొనుచు
హితమతినేతెంచి నిభపురంబునకు,
మఱి, వాఁడుఁ దర్జనీమధ్యమాంగుళుల
నిఱికించి బాణంబు లేయ సాధించె.
అర్థితో నారీతి నాచార్యవరుఁడు
పార్థుతోనాడినప్రతినచెల్లించి,
యరుదార ధర్మజుండాదిగాఁగలుగు
కురుకుమారులకేయఁ గొలఁదిగానట్టి
యరుదైన లక్ష్యంబు లర్జునుచేత
నురుమతి చేయించుచుండె; నాగురుఁడు
నాయుధవిద్యారహస్యమార్గంబు
లాయింద్రతనయున కన్నియుఁజెప్పి:

అస్త్రవిద్యాపరీక్షణము



చూచెదఁగాక శిష్యులదృష్టి ముష్టి
యేచందమో' యని యెన్నికచేసి,

  1. ముసటిల్ల (మూ )