పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

279

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము


యేకాంతమున నంత నింద్రతనూజు
డాకుంభజునిఁబల్కు: "నవధారు గురువ!
నాకంటెనెక్కుడు నరులలో వింట
లేకయుండంగ నిల్పెదనంటి విద్య:
నేకలవ్యునిఁ జెంచు నేముచూచితిమి;
నీకృప దానఁట నేర్చెనువిద్య!
నాకంటే నీకంటె నానాప్రకార
లోకులకంటె నుల్లోకుండువింట.
వాలుచునున్నాఁడు వాడు మీచేత;
నోలిమై విలువిద్య లొగి [1] నేర్చెనట్టె!
వారక యిటువంటివారు మీశిష్యు
లారయ నెందఱో! యవనిలోపలను;
అటుగాన, మీపల్కు లనృతంబులనుచు
నిటపల్కనోడుదు నేవిధంబులను.”
అనుటయు నుదరి యయ్యమరేంద్రతనయుఁ
దన వెంటరమ్మని తడయక గురుఁడు
అనఘ, శిష్యులుఁ దాను నప్పుడేపోయి
వనచరుఁగాంచిన, వాఁడాత్మఁబొంగి
గురునకునెదురేఁగి గురుభక్తి మ్రొక్కి ,
కరపద్మములుమోడ్చి కరమర్థి మీఱఁ
దేనియ ఫలములుఁ దెప్పించి, యపుడు
కానుకగానిచ్చి కరమర్థిఁబలికె
చేపట్టితివి నన్ను శిష్యునిఁగాఁగ;
నాపుణ్యమున వచ్చినాఁడవు వెదకి;
యిదెశస్త్ర, మిదెగాత్ర, మిదెకళత్రంబు;
మది నేదిగోరెదు మసలకయిత్తు;

  1. నోర్చినట్టి (మూ)