పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

277


గారుడశర, మంధకారబాణంబు,
సౌమ్యంబు, యామ్యంబుఁ, జక్రసాయకము,
ఘన శాత కర్కశ క్రకచోగ్ర భల్ల,
మెనయఁ గౌబేర మాహేశ్వరాంబకముఁ,
గాలాంత సంవర్తకాల బాణములు,
జాల నుష్ణానుష్ణ[1] జనకాస్త్రములును,
వారుణాస్త్రములును, వైష్ణవ దైత్య
మారుతాస్త్రములిచ్చి, మఱియు వేడుకను
బరిఘ గదాంకుశ ప్రాసాగ్ర ముసల
పరశు తోమర ఖడ్గ[2] భల్లనారాచ
ఘనభిండివాల ముద్గర కుంత చక్ర
[3]జనితకుఠారముల్, ఛురికాక్షురప్ర
వినుత నానాయుధ వితతులాదిగను
వినమితకృపనిచ్చె వెస నర్జునునకు.
అంత, వినోదార్థ మఖిలకౌరవులు
వింతగా నడవుల వేటఁబోఁదలంచి,
యడరంగ గురునిచే ననుమతివడసి,
తడయకందఱుఁగూడి తగబోవునపుడు,
లాలితంబుగ నేకలవ్యుని బాణ
జాలంబు లోలి లక్ష్యముఁ దాఁకునట్టి
చప్పుడాలించి యచ్చట వేటలాడి
తప్పకయ్యడవి నందఱు నొక్క తెగువ
దంటమృగంబుల ధరఁగూల్చుచోట,
నొంటి మైఁబడి తప్పి యొక శునకంబు
తప్పులోవలఁబోయి, తమవారిఁగాన
కప్పుడు వాపోయినట్టువాపోవ,

  1. జనితా
  2. ప్రాసాగ్రముసల
  3. జనితకుఠారయుచెలికాక్షురంధ్ర (మూ)