పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

269


ధనవంతుతో [1]జన్మదారిద్య్రునకును,
ఘనసత్వనిధితోడఁ గడఁగి మూర్ఖునకు,
రణబలోదగ్రుతో రణభీతునకును,
గుణగరిష్ఠునితోడ గుణశూన్యునకును
దలపోయఁ 'జెలికాఁడఁదా' ననఁదగునె!
చెలిమిగావింపను, జేరిభాషింప,
బలిమిఁబోరాడను, బాడినిబెనఁగఁ,
గలహింపఁ, ద్రోపాదఁ, గలసివర్తింప,
సమసత్వులైనను సమకూడుఁగా; క
సమ[2]విభవుల కేల సాంగత్య మొదవు!
ధరయెల్లఁ బాలింపఁదగు రాజ నేను;
బరికింపఁగాఁ బేదబాపఁడవీవు;
మిత్రుండననుమాట మిన్నకిట్లాడి,
శత్రుండవైతివి చనుమిందుఁ బాసి.
అదియేల! కార్యార్థమై నీచదశల
నొదవును సన్మైత్రి యొక్కొక్కయెడల;
భూపాలురకు నల్పపురుషులందైన
దీపించుశుభవేళఁ; దిరమానెయదియు!”
నని క్రూరచేష్టితుండై భూవిభుండు
తనసేవకులఁబంచి, తత్సభాస్థలము
'వెడలంగనడపుఁడీవిప్రుని' ననుచు
దడయక త్రోపించె ధర్మంబు వదలి.
త్రోచిన వెలువడి, [3]తోఁ దొట్రుకొనుచు,
నేచి క్రోధాగ్నిచే, నింతియు నేను
ననఘాత్మ, లజ్జించి యందఱిలోన,
ననువేది మనసు పదాఱింటవిఱిగి:

  1. చెల్మి దారిద్రునకును
  2. వేళముల
  3. తొలి (మూ )