పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

ద్విపద భారతము


నా పేరు ద్రోణుండు నరనాథచంద్ర,
యేపున నాకోర్కె యిచ్చి నన్ననుపు
పాలుద్రావెడి తోడిపడుచులఁ జూచి
బాలుఁ డశ్వత్థామ పాలు వేఁడినను,
నీయాన, వరిపిండి నీళ్లలోఁ గలిపి
చేయారనిత్తుము చెప్పెడిదేమి!"
అనవిని ద్రుపదుం డహా! యని నవ్వి,
తన రాజ్యమదమునఁ దగవేది పలికె  :
"ఎక్కడిచెలికాఁడ! వేవలరాక!
యెక్కడికరుదేర! నిదియేమిపాఱ!
బక్కవు నీవెట్లు! ప్రభువ నేనెట్లు!
వెక్కిరించెడు వారి వీక్షింపవైతి!
కుంచెడు బియ్యంబుఁ, గూరగట్టయును,
బంచాంగపఠనంబుఁ బ్రాప్త౦బు నీకు.
ఎన్నఁటి చెలికాఁడ! వేనాఁటివాఁడ!
వెన్ననాతరమేడ! [1] నీతర మేడ!
నాసరివాఁడవే! నాతోడి చెలిమి
యోసరింపక చేయ నుర్విలోపలను!
వెనుక నెన్నఁడు నిన్ను విని యేనెఱుంగఁ;
గనియునునెఱుఁగమే! కాఱులాడెదవు;
కాన, నిప్పుడు రాచకార్యంబు గలదు;
జానొప్ప నెందైనఁ జయ్యనఁ జనుము.
చెలికాఁడ వెట్లైతి! చెప్పిడిదేమి!
కలలోననైనను గదిసి నీతోడ
భాషించియెఱుఁగము; పాలుమాలుదురె!
పోషణకిట్లాడఁబోలునె విప్ర!

  1. నీవనునదేడ (మూ)