పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

ద్విపద భారతము


'గూడ నెవ్వఁడుపాఱి కూడిన వాఁడె
యీడువానికి' నని యి ట్లెన్నుకొనుచు
నాడుచో, నొక్కనాఁ దామేటిచెండు
మేడలపైఁ బాఱి మిద్దియ లెక్కి
పరిపూర్ణసితకరప్రభ లుల్లసిల్ల
నురవడి మెఱయుచు నొప్పార నదియు
వాటుకందక వచ్చి వడి నప్పురంబు
కోటవెల్పల వడిఁ గూపంబులోనఁ
బడిన, నందఱుఁ జెండుఁ బట్టి రాఁదివియ
నొడఁగూడమికిఁ జూచుచుండిరి కూడి.

ద్రోణుఁడు నూతఁబడిన కందుకము నుద్ధరించుట



అంత ద్రోణాచార్యుఁ డాలును దాను
సంతానతిలకు నశ్వత్థామఁ గొనుచు,
నిలుగుజన్నిదములు నీర్కావి [1]దోత్ర
మలికంపుఁగీల్కొప్పు నరపగడ్డంబు,
వెడఁదవక్షంబును విల్లునమ్ములును
[2]మెడపెంవునడరించు మేలుపచ్చడము
నందంద చూపట్ట నచటికి వచ్చి,
యందఱ దీవించి, యానూతిలోని
ఫణిఫణారత్నప్రభాభాసమాన
మణికందుకముఁ జూచి మందహాసమున
నిందఱ నిట్లను : "నిది యేమి! మీర
లిందువంశపురాజు! [3]లెంతకు లేరు!
కృపుడంటె మిమ్ము శిక్షించెడిగురువు!

కృప సేయఁడయ్యెనో కృప నిట్టిపనికి!
  1. దొల్లున్
  2. మెడవంపులడరించు మేరుపచ్చడము
  3. లిందుకునేర (మూ )