పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

257


నూనెదట్లును మొలనూళ్లును బిగిసి
మేని క్రొమ్మించులు మెఱయ, నిత్యంబు
నభ్యసించినవిద్య లాపగేయాది
సభ్యులముందఱఁ జక్కఁజూపుచును,
మక్కువ నందఱు మహిమతో నప్పు
డక్కజంబుగ నేర్పు లమరఁజేయుచును,
జాపశిక్షాప్రౌఢి చాతుర్య గరిమ
యేపారఁ జెలఁగించి యెలమి మించుచును,
దమలోనియాగ్రహతము నొక్కనికిని
సమచిత్తులై శాంతి చాల నేర్పుచును,
ఓర్వలే కందులో నుగ్రించునతని
నుర్విఁ గృపాచార్యు కొనరఁ జెప్పుచును,
జెప్పిన గురుమూర్తిశిక్షల కులికి
ముప్పిరి నందఱు మొగి నొక్క టగుచు,
నూఱటయగు వేళ [1] నుబుసుపోకకును
బౌరులు వీక్షింప బాల్యంబు గానఁ
జెలువుగా ముత్యాలచెండు గట్టించి
కలసియాడుచు, మిన్నుగాఁడనేయుచును,
వ్రేసినఁ గ్రుంకిడి వెసఁ జెండు గొనుచు
డాసి క్రమ్మఱలేచి డాసిపోవుచును,
వెనుకొని వ్రేయుచు వెస నుర్వివ్రాలు
ఘనకందుకముఁ బాఱి గ్రక్కునఁ గొనుచు,
నారీతి వైచుచు నటవచ్చుచోటఁ
జేరి పైపైపడి చేతు లొగ్గుచును,
నెవ్వనిచేఁ జొచ్చె నింతలో వాఁడె

దవ్వుగా నిందఱ దాటిపోవుచును,
  1. ఉబ్బసపోక (మూ )