పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

ద్విపద భారతము


నేర్చితి నతనిచే నిఖలశాస్త్రములు;
రాచచిత్తంబులు రానుండ నేర్తు;
నేలిన మేలు; నన్నేలుఁడు మీర;
లాలంబులోన సహాయమయ్యెదను."
అనిన భీష్ముడు పల్కు: “నాచార్య, నీవు
ధనువు నేర్పుదుగాక ధార్తరాష్ట్రులకు.
'ఎవ్వరుగలరొకో యిచ్చోట' ననఁగ
రువ్వున వచ్చితి రుత్త మోత్తములు.
వీరె కౌరవ్యులు; వీరె పాండవులు;
వీరె నానాదేశవిభుకుమారకులు;
బాలశిక్షకు మీరు ప్రౌఢులుగాన,
నీ లేతబిడ్డల కీడేర్పుఁ" డనుచు
భూమీశుననుమతిఁ బొలుపొంద నైదు
గ్రామంబు లతనికి గ్రాసార్థ మిచ్చి,
కరిముఖునకు [1]మోదకములు పెట్టించి,
కరిదంతముల విండ్లుఁ గనకలక్ష్యములుఁ
జక్కనిశరములు శస్త్రభేదములుఁ
జక్కనిజోళ్లు విచిత్రపుఁదొనలుఁ
చేయించి, చల్లని శ్రీఖండతరుల
నాయతమగు శాల లాయత్తపఱచి,
యాచార్యులకుఁ జీర లాభరణములు
దాఁచినరతిఁ గన్నుతనియంగ నిచ్చి,
నృపకుమారులనెల్ల నేర్వఁ బెట్టుటయుఁ,
గృపుకృపామహిమ మిక్కిలి గల్గి వారు
లక్ష్యంబు లేయుచు, లలనాకటాక్ష
లక్ష్యంబులై హస్తలాఘవం బొప్ప,

  1. మోదకము లెక్కించి (మూ )