పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

251


దనకురాల్పకయున్నఁ దరువులు పట్టి
పనివడి భీముండు పడరాల్చు మమ్ము.
పెక్కేల! యర్జునుపిడికిలి వీడ
నొక్కలేమైతిమి నూర్వురుఁగూడ.
నొగలఁడుధర్మసూనుఁడు; [1]వాదు కొయ్యఁ
దగవు చెప్పినయట్లు దండించు మమ్ము.
ఏపదార్థంబైన [2]నిమ్ముతోనిమ్ము
చూపుదిప్పక దాఁచి చూపకయున్న,
నెట్టి వివేకులో! యేతెంచి కవలు
పట్టిచూపుదు; రిట్టి బలియులుగలరె!
కన్నార ధర్మజుఁగన్న కన్నులకు
నన్ను రాజన నేలనమ్మికపుట్టు!
అటుగాన, నేయుపాయంబులనైనఁ
బటువృత్తి, బవనజుఁ బరిమార్పవలయు.
వాఁడొకఁ డీల్గిన వారిలావణఁగుఁ;
బోఁడిగా నేలుదు భువియెల్ల నేను."

దుర్యోధనుఁడు భీమునిఁ జంపఁ దివుఱుట


అన, వానిఁ దెగటార్ప ననవు చింతించి
పనిచిన, గురురాజు పవనజుఁ దొలుత
జలములు తమలోన జల్లుపోరాడి
యలసి నిద్రించిన యాసమయమునఁ
బట్టించి సంధులు, బలువుకంబమునఁ
గట్టించి యొకనాఁడు గంగఁ ద్రోసినను,
మునుఁగుచు నడుమ భీముఁడు నిద్ర దెలిసి,
తనువుననున్న బంధముతోడ [3]ల్లి

  1. నాదు
  2. నినుమతో
  3. నిల్లి (మూ)