పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

ద్విపద భారతము


బెరయ నొండొరుఁ బట్టి పెనుగులాడుచును,
దరమిడి [1]తగులునఁ దాఁకులాడుచును,
మఱియును శిశువులు మహి వేడ్కవుట్టి
నెఱి నాడుదెఱఁగులన్నియు నాడుచోటఁ,
బవనసూనున కోడి, పార్థున కోడి
కనలకుఁ బాండవాగ్రజునకు నోడి,
యోడినకోపాగ్ని నుల్లంబు గమరి,
యాడినపంతంబులన్నియుఁ దప్పి,
యనిలనూనుఁడు దమ కధికుఁడై యున్న
గనుఁగొనఁజాలక, కడు[2]నిగ్రహమున
నంతటఁ దెలియక, యాసుయోధనుఁడు
మంతనంబున మేనమామ కిట్లనియె:
“సులభసాధ్యులుగారు చూచితే శకుని!
బలవంతులెంతయుఁ బాండునందనులు;
వారిలోపల నెల్ల వాయునందనుఁడు
వారనికడిమి దుర్వారతేజుండు ;
మూర్తిమంతుఁడు; వీని మును జంపకున్న
ధార్తరాష్ట్రుల కెందుఁ దలలెత్తరాదు
పగవానిఁదెవులును బ్రబలకమున్న
తెగఁజూడకుండినఁ దెగును గార్యంబు.
ఇందఱుఁ జూడంగ నెకసక్కమునను
బొందేది మారుతపుత్త్రుండు మమ్ము
నిరుమూపు లెక్కించి యీఁదుచు, నడుమఁ
బరిహాసగతి ముంచుఁ; బ్రార్థింప విడుచు.
చలమున నేము వృక్షము లెక్కఁ జూచి
'ఫలములఁ దెండు కప్పములు నా' కనుచుఁ,

  1. తగళ్ళెన
  2. సంభ్రమమున (మూ)