పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము


'కొడుకులు నూటయేగురు నా' కటంచు
నెడనెడ నాడుచు నెందు నేమఱక,
పెద్దగద్దియమీఁదఁ బేరోలగమునఁ
దద్దయుఁ బ్రియముతో ధర్మనందనునిఁ
దొడలపై నిడుకొని, దొరయ ధర్మంబు
లడుగుచు రాచకార్యంబు దీర్చుచును,
భీమార్జునులలావు పేర్మిమై గడఁగి
వేమఱు ఘనశత్రువిజయంబు [1]గనుచు,
నకులుని సహదేవు నన్నలచెంత
నకలంకమతికి [2]నందంద మెచ్చుచును
బాండునిమాఱుగాఁ బరికింపుచుండె.

బాల్య క్రీడలు, అసూయాంకురప్రాదుర్భావము



పాండుసూనులఁగూడి బాల్యంబునందు
దుర్యోధనాదులు తోడఁబుట్టువులు
గార్యార్థిమిత్రులై కడుఁబొత్తు గూడి,
సాముచోఁ జదువుచో జలకేళిచోట
వేమాఱు విలువిద్య వెసనేర్చుచోట
నిద్దఱిద్దఱు గూడి యే క్రియనైన
సుద్దుల మనుచుఁ బెన్నుద్దుల మనుచు
బయళుల నుప్పనఁబట్ట లాడుచును,
బ్రియము నటించుక పేరు లాడుచును,
దీపు [3]పుట్టఁగ బిల్లదీపు లాడుచును,
గోపురా నొడ్డనకోపు లాడుచును,
ఏటిలోతునఁ జొచ్చి యీఁదులాడుచును,
[4]ఏటిపారపుమ్రాఁకు లెక్కి యాడుచును,

  1. నగుచు
  2. నానంద మిచ్చుచును
  3. బుట్టుచు
  4. ఏరిభారము (మూ)