పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

ద్విపద భారతము


" ఓన్యాయధృతరాష్ట్ర, యోధృతరాష్ట్ర,
ధన్యులు వీరె నీతనయులేవురును;
వరుస నంతక వాయు వాస వాశ్వినుల
వరములఁబుట్టినవంశవర్ధనులు ;
ఇతఁడు యుధిష్ఠిరుం; డితఁడు భీముండు;
ఇతఁ డర్జునుండు; వీరిరువురుఁ గవలు
[1]నకుల సహదేవ నామ నాయకులు;
ఒక భేదమును లేక యోముము వీరి;
నిరువురుమాద్రేయు లీపృథాపుత్రు
లరయ భూపతిచావ నరుదెంచినారు;
మాద్రి యూతనితోడ మరణంబుఁ బొందె;
ముద్రగా నిదె యస్థి మోచితెచ్చితిమి;
పట్టితి మొకరీతిఁ బడకుండఁ గుంతి;
నెట్టివారికి వలదే తల్లినీడ!
ఓసరింపక వారి కుత్తరక్రియలు
చేసి శిశువులఁ జేపట్టు మనుచు
జననాథునకుఁ జిత్తశల్యంబులైన
యనుజునిశల్యంబు లాపొంత నునిచి
మునులు పోయిన, రాజు మూర్ఛిల్లి తెలిసి,
తనయులు భీష్ముండుఁ దానుఁ దల్లులును
విదురుండు సచివులు ద్విజులు గాంధారి
మొదలుగాఁ గూడి తమ్మునకు వాపోయి,
భూదేవసహితుఁడై పురజనుల్ గొలువ
నాదేవనది కేఁగి, యమసూతి[2]చేత
నొద్ద వేదవ్యాసుఁ డొజ్జయై చెప్ప
ముద్దుతమ్మునిశల్యములు సంస్కరించి,

  1. నకులుండు
  2. చెంత (మూ)