పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

ద్విపద భారతము


అందఱి లోపల నధికమై యగ్ర
మందున ధర్మరూపాకృతి దాల్చి,
జలనిధిపర్యంతసకలభూతలము
వెలయనేలెడుచిహ్న వెరవొప్పఁ గలిగి,
ప్రాకటంబుగ సౌర్వభౌముఁడై మించి,
యీకడ మనబోంట్లనెల్ల రక్షింప
నాకీశవైభవోన్నతితోడ మెఱసి,
జోకవచ్చెడు ధర్మసుతుఁ డల్లవాఁడె
ఆతని వెనుక మహాధురంధరుఁడు
భీకరాకృతితోడఁ బెంపగ్గలింప,
'ననిమొనఁ దనకెదురైనరాక్షసుల
గనియలు తునియలుగాఁ జేతు,' ననుచుఁ
గడఁగి కయ్యమునకుఁ గాలుదువ్వుచును
వడివచ్చుచున్నాఁడు వాఁడు భీముండు;
కడిమిపై రాము భార్గవరాముకరణి
గడిదేరి చాపసంకలితుఁడై మెఱసి,
వికటశాత్రవవేరువి త్తితఁ డనఁగఁ
బకపక నవ్వుచుఁ బావనివెనుకఁ
గనుఁగొని తమయన్నకనుసన్న మెలఁగ
వినయంబుతో వచ్చు విజయుండు వాడు;
మాద్రికుమారు లిమ్మహిఁ గరుణాస
[1]ముద్రులై వినయసమున్నతి వెలసి,
సలలితభూతభవిష్యద్వర్తమాన
కలితాత్ములై మించి కడఁకఁ బెంపొంది,
చనువొప్ప నకులుండు సహదేవుఁ డనఁగ
వెనుకొని విజయుని వెనువెంటఁ గొలిచి,

  1. ముద్రులై వెలసి సముద్రములై వెలసి (మూ )