పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

243


ధరణీభరంబు బాంధవరక్షణంబు
నరయంగ విడిచి ఘోరాటవి చేరి,
తనకును శరణంబు తాపసు లనుచుఁ
జనుదెంచి తప మర్థిఁ జాలంగఁ జేసి,
సురలవరంబున సూనులఁ గాంచి
పరలోకగతుఁడయ్యెఁ బరికింప జగము ;
మనుజేశ్వరుఁడు నమ్మి మగువలుఁ దాను
మనలోపలనయుండ [1]మనబందు." వనుచు
మారెడు నేరెడు మామిడి మఱ్ఱి
యారావి శమి మోదుగాదిగా వెదకి
వట్టిపోయినతుండ్లు వారక తెచ్చి,
యొట్టి యయ్యిరువుర కుచితాగ్నియిచ్చి,
యయ్యస్థి నీటిచే నందంద తడిపి
చయ్యన నవదర్భశాఖలఁ బొదివి,
కుంతికిఁ గొడుకులకును శోకమార్చి,
యంత వారలతోడ నయ్యస్థి గొనుచు
నెచ్చట నిలువక యిభపురంబునకు
దెచ్చిరి పదియేడుదివసంబులకును.

పాండవుల హస్తిపురప్రవేశము



పౌరు లంతకుమున్ను పాండునందనులు
వారక చనుదెంచువార్తల కలరి,
చదురొప్ప నానందజలధి నోలాడి
కదియుచుఁ దమలోనఁ గడఁక నిట్లనిరి:
"పాండునిభాగ్యంబు పల్లవింపంగ,
నిండుగొంతెమకడుపు నిండి వెలుంగ,
వరమునఁబుట్టిన వంశవర్ధనులు
వరుస వచ్చుచునున్నవారు పో వీరు.

  1. మనకుంబోదనుచు (మూ)