పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

ద్విపద భారతము


దండెత్తి యామని తన [1]ముందుఁ నడవ,
నొండొండ జగముల నురుతేజ మెసగఁ,
గలఁగొని రతి[2] కేళిఁ గడఁకలు [3]మీఱి,
తల కురు లెఱుఁగక తడఁబడువారి,
సంగతిఁ గాంతలచనుగుబ్బలనెడి
లింగంబులను గౌఁగిలించినవారి,
మనలక సతులకమ్మనిమోపులనెడి
కసవుల మఱువక గఱచినవారి,
ననువారఁ దోయజాతాక్షులపిఱుందు
లను పుట్టలెక్కి పాయక యున్నవారి
మన్నించి, విజయుఁడై, మఱియు లోకమున
నున్న జీవుల నేయుచుండె నొండొండ.
చిత్తవికారంబు శివునంతవాని
హత్తఁజేసినయట్టి యాఋతువునను,
అట పాండుభూపాలుఁ డంగసంభవుని
పటుబాణపాతహృత్పద్ముఁడై యలసి,
మానంబు తన కనుమానంబుగాఁగ
నూనినవిరహాగ్ని నుడుకుచునుండి,
మాద్రివెట్టఁగరాని మానితాకార
మాద్రిపై మోహంబు మరలింపలేక,
శాపంబుకతముగా జనియించుభీతి
నేపార నలయుచు నిట్లున్నయంత,

పాండుని మరణము

వనజాక్షి మాద్రి భూవరునికట్టెదురఁ
దనరూపునకుఁ దగఁ దద్దయు వేడ్క

  1. విలోఁచిత
  2. కేల
  3. మాలి (మూ)