పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

ద్విపద భారతము


అమరంగ నొప్పుదు రనుభంగిఁ దరులు
సుమనోవిలాసభాసురలీలఁ బొదివె ;
ఫలియించెఁ బాండుభూపతితపం బనఁగ
ఫలియించె వృక్షముల్ సాయకెల్లెడల;
మలయాచలంబున మలయుచుఁ [1]గదలి,
జలజాకరంబుల చలువ నోలాడి,
పరువెత్తి, యొయ్యన బలసి, పూఁబొదలఁ
బరగుపూమొగ్గలఁ బరువులెత్తించి,
తెలియఁబుష్పిణులైన తీగెజవ్వనుల
తలిరాకు చెఱఁగైనఁ దాఁకునో యనెడి
ఘనశంకఁ జరియించుకరణి గంధాద్రి -
యనిలుండు చల్లనై యల్లన వీచె;
వీఁగుచు లేఁగాలి [2]విటుతలమీఁద
నూఁగెడువిటపులయుపరిభాగముల
నొలికెడుగతి రాలె నుత్ఫుల్లకుసుమ
వలమానమకరందవరఘర్మజలము ;
వేఁట పాంథులమీఁద వెడలుచో మరుని
మీటైన గండుతుమ్మెద నల్లప్రజకుఁ
దావుకూళులుచూపు తావు లనంగఁ
గ్రోవులతావులు గూర్చె మధుండు ;
ఆవిరులందు నొయ్యన దూరిదూరి,
[3]క్రేవలరసము పుక్కిటఁ బట్టిపట్టి,
పొడబొట్లు పడకుండఁ బుప్పొడి యలఁది,
సుడిసి మై యెఱుఁగక సోలియాడుచును,
బలువిధంబులఁ [4]బాఱి, పంచమశ్రుతులు
పలికెడు చిలుకలబలగ మొప్పారె;

  1. దగిలి
  2. విటువుల
  3. కేవిపులరసము
  4. బోలి (మూ)