పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము

235


నలిమీఱఁ జౌలోపనయనాదివిధులు
కొలఁది కగ్గలముగా గోర్కెనొనర్చి,
[1]విదితశౌర్యులకును వేదశాస్త్రములు
చదివింపుచుండె నాసంయము లలర.

వసంతోదయము

అంత వసంత మత్యనురక్తి జగము
లెంతయు నలరంగ నెలమిదై వార
[2]హత్తె భూభువనమం దఖిలజీవులకుఁ
జిత్తానురంజనశ్రీ యుల్లసిల్ల,
తరువులామధువునఁ [3]దలఁగుప్రాయములు
తిరిగివచ్చుట యెల్లదిక్కులఁ దెలిపె;
నలజీర్ణవర్ణంబు లనియెడు [4]నరలు
[5]తలఁగి శీతవ్యాధిఁ దగులుట [6]దెలిపెఁ;
[7]'గురుకుమారకుల కాకులపాటు గలుగు
నరయంగ నిటమీఁద ' ననిచెప్పుకరణిఁ,
దొడిమలతోనూడి తోడ్తోడ ధాత్రి
[8]నడరంగఁ దరులఁ గారాకులు డుల్లెఁ;
బొరిపొరిఁ బాండవాభ్యుదయంబునకును
బరికింప విదురాదిబంధుచిత్తంబు
విలసితంబుగఁ బల్లవించునీమాడ్కి
[9]లలి నంచుఁ దరులఁ బల్లవము లొప్పారె;
గోకిల శుక భృంగకులములఁ బిలువ
నాకులువెట్టిన ట్లాకులఁ బెట్టె;
సుమనోవిలాసభాసురలీలఁ జెలఁగి
సమబుద్ధిఁ గీర్తివాసనలఁ బాండవులు

  1. విదదశరధులకును.
  2. హత్తిభూర్భువనాలి నఖిలజీవులకు
  3. దలుకు
  4. నరులు
  5. తగిలి
  6. దెలిసి
  7. కురుకుమారులకు గులపాటుగలుగ.
  8. నలరంగ
  9. లలి దరులందు కుసుమము లొప్పారె (మూ)