పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

ద్విపద భారతము


ఘనతఁ పాండునిమనఃకమలంబు విరియ,
ననయంబు గొంతియు నాత్మలో నలరఁ,
గామునిశరములు కల్పవృక్షములు
నామహాదేవుని యయిదుమోములును
ఈరూపములఁ దాల్చి యిలఁ బుట్టెననఁగ,
భూరి తేజంబులఁ బొగడుదీపింప,
ధర్మ భీమ సుత్రామజ [1] యమలు
పేర్మి నానాటికిఁ బెరిగి పెంపొంది.
రీరీతి నందను లేగురు గలిగి
పౌరవకులకర్త పాండుభూభర్త
శతశృంగగిరిమీఁద సతులును దాను
వ్రతధారియైయున్న; వసుధలో నంతఁ
బడఁతులతోఁగూడఁ బాండుభూవిభుఁడు
అడవికి వేఁటమై నర్థిఁ బోవుటయు,
మృగశాపభయము గ్రమ్మిన రాజ్య ముడిగి
పొగడొందఁగాఁ దపంబునకు జొచ్చుటయు,
దేవతావరములఁ ద్రిదశేంద్రసముల
నేవురఁబుత్రుల నెలమిఁ గాంచుటయు,
విని వసుదేవుండు వేడ్కలువొదువఁ
దన [2]కూర్మి చెలియలిఁ దనకూర్చుమఱఁదిఁ
దనమేనయల్లుండ్రఁ దగమద్రసుతను
'గనుఁగొనిర ' మ్మని కశ్యపు ననుప,
నాపురోహితుఁ డేఁగి యఖిలతంత్రముల
నాపాండుభూవరు [3]నర్థి దీవించి,
వరరత్నభూషణావళులు వేర్వేఱ

నరుదారఁగా నిచ్చి, యాకుమారులకు
  1. కవలు
  2. భ్రాత
  3. నర్థితో గాంచి (మూ )