పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

233


గలశజుచే వీఁడు ఘనత పెంపొందఁ
గలఁడనంగను గుచకలశంబులోని
[1]పాలిచ్చె ననఁదోపఁ బరఁగు నొండొక్క.
బాలుఁ జన్నిచ్చుచు భరియించుదాని,
మిన్నంతవేడ్కతో మృదుశయ్యమీఁద
నున్న కుంతీదేవి నొయ్యనఁ గదిసి :
"యీమాద్రి రక్షింపు; మిది నీకుభరము;
[2]భామ, నీకెంతయుఁ బరమపుణ్యంబు;
[3]నీ కీమె చెల్లెలు; నీ కిట నెపుడుఁ
జేకొని శుశ్రూష చేయుఁ; గావునను,
ఇమ్ముగా ముని నీకునిచ్చినమంత్ర
మిమ్ము సత్కృపతోడ నెలమి నీ." వనుచు
మాద్రిచందము చెప్పి, మంత్ర మిప్పించి,
మాద్రికిట్లనియె నమ్మనుజనాయకుఁడు :

కవలజననము

"జగదేకవిఖ్యాతచరితు లశ్వినులు;
మగువ, నానాజ్ఞానమహితులశ్వినులు;
వారి నారాధింపు వచ్చెద." రనిన,
ధారుణీశునియాజ్ఞఁ దరళాక్షి మాద్రి
యిచ్చలోఁ దలఁచిన, నిరువురశ్వినులు
వచ్చి నిశావేళ వరమిచ్చిపోవ,
హిమకరనిభగర్భ మేఁడాది దాల్చి,
యమడలఁ గాంచె నయ్యశ్వినులందు.
విహితప్రతాపులు వీరలు నకుల
సహదేవులనుచుఁ బుష్కరవాణి పలికె.

  1. పాలిచ్చెననబరగునొక్కొంటి.
  2. భామినికెంతయు
  3. నీ కిట చెల్లెలు (మూ)