పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

ద్విపదభారతము


కుంతీమహాదేవి కొడుకుల ముగురఁ
గంతుసమానులఁ గర మొప్పఁగాంచె;
నెక్కడి నాజన్మ! మెక్కడి బ్రదుకు!
అక్కట! వగలపాలైతి నే నిపుడు
పసపార్చి, చన్నిచ్చి, పలుమాఱుచీరి,
కొసరుచు ముద్దాడి, కోర్కి దై వార
నక్కున నురమున నత్తుచుఁ బెనుప
నొక్కఁడైనను నాకు నుదయింపడయ్యె!
కొడుకులు లేనట్టి గొడ్రాలిమనువు
అడవిఁగాచినవెన్నె లైపోవుఁగాదె!
మంత్ర మేమియు నేర; మాతోడ మదన
తంత్ర మీ వెఱుఁగవు; తనయుఁ డెట్లొదవు!
సవతియు నీవును జనఁ బుణ్యగతికి,
నవనీశ, నాకురా నభవుఁ డీఁడయ్యె!
దేవిచే మంత్రోపదేశంబు నాకు
దేవ, యిప్పింపఁగదే!" యన్న నతఁడు,
వేలెడునిడుపులై వ్రేలెడుకురులుఁ
దూలెడునడవులు దొక్కుమాటలును
ముద్దుగానొప్పెడి మూఁడేండ్లకొడుకు
నొద్దనె ధర్మజు నునిచినదానిఁ,
'జేతప్పి ప్రిదిలిన [1]చిన్నివ్రేఁకమున
ఱాతిచట్టువమీఁద రవమయ్యెఁదొల్లి;
ఇంతమహాసత్వు నిట్లుధరించు
నంతటిదానఁగదా!' యను వేడ్క
నెలమి నాభీము రెండేఁడులవాని
బల మొప్ప నూరులపైఁ దాల్చుదానిఁ,

  1. చిన్న వేంకువను (మూ)