పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

ద్విపదభారతము


భర్గుఁ దా నెక్కటిబవరాన గెలిచి,
మార్గణరాజంబు మహిఁ బొందఁగలడు;
బొందితోడనె యింద్రుపురమున కేఁగి,
యందు రాక్షసకోటి హరియింపఁగలఁడు;
అనలుని మెప్పించి, యరదంబు విల్లుఁ
దొనలు [1]రథ్యములుఁ గేతువుఁ గాంచఁగలఁడు;
ఇతఁడు రాజుల గెల్చి, యెలమి ధర్మజుని
నతివేడ్క రాజసూయంబు చేయించుఁ;
గతలేల! యితఁ డింద్రుఖాండవవనము
చతురుఁడై కాల్చు వాసవుని నోడించి;
యుత్తరఫల్గుని నుదయించెఁ గానఁ,
గ్రొత్తగా దితని ఫల్గునుఁడనఁ జెల్లు;
నితఁ డీశ్వరునిఁగూర్చి యెలమిమైఁ దపము
చతురుఁడై కావించు జగమెల్లఁ బొగడ. "
ననునంత దేవత, లఖిలసంయములు,
మనువిశ్వవసువులు, మారుతంబులును,
గరుడగంధర్వులు, గ్రహతారకాదు
లరుగుదెంచిరి కూడి యర్జునుఁ జూడ,
పాండురా జప్పుడు పరమమోదమున
దండప్రణామముల్ తగ నాచరించి,
యందఱఁగూర్చి : "కృతార్థుఁడనైతి;
నందనఫలసిద్ధి నాకబ్బె నేఁడు;
ఈకురుకులమెల్ల నేచి వర్ధిల్లె;
నాకు నెంతయుఁ గల్గె నాకలోకంబు;
కడువేడ్క వివిధలోకంబులవారిఁ
బొడ[2]గాంచుటాయెఁగా! పుత్త్రులఁ గనుట;

  1. రథ్యంబు
  2. గాంచుటయును దా (మూ)