పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

227


ఆలోన ‘నోడకు' మనుచు భూపతియు
వాలిక విలు గుణధ్వని చెలంగించి,
దూలమువోని శార్దూలముఁ దునియ
వాలమ్ము లేసి, యవ్వసుధేశుఁ డంతఁ
బవమానసుతుమీఁదఁ బడియున్న కుంతి
నవమానవతి నెత్తి, నందను నెత్తి,
'తను వెంతగట్టియో తనయున! ' కనుచు
మనమున సంతోషమహిమ లింపొంద,
దేవాలయమునకుఁ దెఱఁగొప్ప నేఁగి,
యావేళ జగదంబ నర్చించి వేడ్క,
సతియును దానును సాష్టాంగమెఱఁగి,
స్తుతవచోరచనల స్తుతి చేసి రిట్లు :
"గౌరి, వారాహి, శాంకరి, దుర్గ, త్రిపుర
భైరవి, శక్తి, జపారత్నవర్ణ,
ఫాలాక్షి, మధుమతి, పరతత్వ, జనని,
కాళి, కంకాళి, హ్రీంకారి, రుద్రాణి,
భుజగభూషణుదేవి, పూర్ణేందువదన,
విజయ, శర్వాణి, దేవీ, జ్ఞానమూర్తి,
వారాహి, చాముండి, పరదివ్యమూర్తి,
ఘోరదంష్ట్రి , కరాళి, కోమలి, ముగ్ధ,
గీర్వాణి, శాంభవి, కీనాశవంద్య,
నిర్వాణసంధాయి, నిఖిలప్రదాయి!”
అనుచు నివ్విధమున నభినుతిచేసి,
తనదేవియును దాను ధరణినాయకుఁడు
నొయ్యన నటపాసి యొగినుండుచోట
నెయ్యంబుతో నుండె నెలఁతలుఁ దాను.
ఈరీతిఁ [1]బుత్త్రుల నెందు నేమఱక
గారవంబునఁ బెంపఁ, గరిపురినంత,

  1. భూమిని (మూ)